శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (18:34 IST)

రవ్వలో ఉప్పు కలిపి తింటే..?

రవ్వతో బ్రెడ్, పాస్తా వంటివి తయారుచేస్తారు. దీని రంగు కాస్త తెలుపు, పసుపుగా ఉంటుంది. ఈ రవ్వ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా దోహదపడుతుంది. సాధారణంగా స్త్రీలు కడుపునొప్పితో ఎక్కువగా బాధపడుతుంటారు. ఆ సమస్యను తొలగించాలంటే.. రవ్వ తీసుకుంటే చాలంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. ప్రతిరోజూ రవ్వతో చేసిన వంటకాలు తింటే.. కచ్చితంగా ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
 
కడుపునొప్పిగా ఉన్నప్పుడు రవ్వలో కొద్దిగా పసుపు కలిపి కడుపు ప్రాంతంలో రాసుకోవాలి. ఇలా చేస్తే నొప్పి తగ్గుతుంది. ఒక్కోసారి తిన్న ఆహారం జీర్ణకాకపోతేకూడా కడుపునొప్పి, వాంతిగా ఉంటుంది. అలాంటప్పుడు రవ్వలో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు తింటే చాలు.. ఉపశమనం పొందవచ్చును. రవ్వ తింటే.. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. రక్తప్రసరణకు చాలా మంచిది.

రవ్వలోని కార్బొహైడ్రేట్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. సాధారణంగా చాలామంది శరీరానికి ఎనర్జీని అందించే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు.. అలాంటివారికి రవ్వ చాలా ఉపయోగపడుతుంది. రవ్వ తీసుకుంటే బరువు పెరుగుతారని ఆందోళన.. వద్దు వద్దూ.. రవ్వ తీసుకుంటేనే... బరువు అధికంగా ఉన్నవారు కూడా తగ్గుతారు. రవ్వలోని విటమిన్ బి, ఇ, ఫ్యాటీ యాసిడ్స్, సొడియం, మినరల్స్ వంటి ఖనిజాలే బరువు తగ్గిస్తాయి. 
 
రవ్వలోని యాంటీ ఆక్సిడెంట్స్ అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే గుండె వ్యాధులు, డయాబెటిస్ వంటి వాటికి ఎంతో దోహదం చేస్తాయి. రవ్వ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. కనుక ప్రతిరోజూ ఉదయాన్నే రవ్వతో చేసిన వంటకాలు తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.