రావణుడి గెటప్‌లో బాలకృష్ణ.. 21న ఆడియో రిలీజ్ వేడుక

ntr biopic movie still
Last Updated: గురువారం, 20 డిశెంబరు 2018 (09:58 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరెకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. "కథానాయకుడు', 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా ఈ చిత్రంరానుంది. తొలిభాగం జనవరి 9వ తేదీన విడుదలకానుంది.

అయితే, ఈ చిత్రంలోని వివిధ పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ధరించిన రావణుడి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య రావణుడిగా అచ్చుగుద్దినట్టు సరిపోయారు. ఈ ఫోటో వెనుకభాగంలో ఈ చిత్రంలో నటించే నటీనటులంతా ఉండటం గమనార్హం.

ఇకపోతే, ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా, వాటికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో 21వ తేదీ శుక్రవారం ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటలకు అతిరథ మహారథుల సమక్షంలో ఈ చిత్రంలోని పాటలను విడుదల చేయనున్నారు. కాగా, ఎన్టీఆర్ బయోపిక్‌లోని తొలి భాగం 'కథానాయకుడు' జనవరి 9వ తేదీన, రెండో భాగమైన 'మహానాయకుడు' ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.దీనిపై మరింత చదవండి :