ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 18 డిశెంబరు 2018 (18:11 IST)

ఐపీఎల్ 2019.. వేలంలో యువీకి షాక్.. తొలి రౌండ్లోనే హనుమ విహారికి చోటు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 కోసం ఆటగాళ్ల ఎంపిక వేలం ద్వారా జరుగుతోంది. వేసవి కానుకగా ప్రారంభమయ్యే ఐపీఎల్ పోటీల్లో భాగంగా ఆయా ఫ్రాంచైజీలు వేలం పాటలో క్రికెటర్లను కొనేందుకు సిద్ధమయ్యాయి. జైపూర్ వేదికగా ఐపీఎల్-2019 సీజన్ వేలం పాట జరుగుతోంది. ఈ టోర్నీలోని ఎనిమిది ఫ్రాంచైజీలు కలిసి మొత్తం 70 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు. 
 
ఇందుకోసం 351 మంది క్రికెటర్లు పోటీపడుతున్నారు. ఈ వేలంలో భాగంగా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కి మొదటి రౌండ్ లో ఫ్రాంఛైజీలు షాకిచ్చాయి. మొదటి రౌండ్ లో యూవీని కొనుగోలు చేసేందుకు ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించలేదు. యూవీతోపాటు మనోజ్ తివారి, పుజారా, మార్టిన్ గప్తిల్, బ్రెండన్ మెక్‌కలమ్, అలెక్స్ హేల్స్(ఇంగ్లాండ్)లపై ఫ్రాంఛైజీలు ఆసక్తి కనబర్చలేదు. 
 
ఇకపోతే.. ఈ వేలం పాటలో ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారిని తొలి రౌండ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2కోట్లకు హనుమ విహారిని దక్కించుకుంది. రూ.50లక్షలతో వేలంలో పాల్గొన్న ఆల్‌రౌండర్ కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా ఆఖరికి రూ.2కోట్లకు విహారిని ఢిల్లీ దక్కించుకుంది