సంబంధిత వార్తలు
- 11-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...
- 10-05-2026 ఆదివారం ఫలితాలు - ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు...
- ఒక్కసారికే తంటాలు పడుతున్న విజయ్, మేజిక్ ఫిగర్ లేకపోయినా 20 ఏళ్లపాటు సీఎం అయిన నితీష్
- రూ.10 వేల లోపు స్టైల్‌తో కొత్త ZENO 200
- 09-05-2026 శనివారం ఫలితాలు - అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు
BSNL: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.. 2.5 జీబీ హై-స్పీడ్ డేటా
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా నెలకు సుమారు 75 జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. రోజువారీ పరిమితి ప్రకారం చూస్తే ప్రతిరోజూ 2.5 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ దీని 30 రోజుల వ్యాలిడిటీ.
ప్రైవేట్ టెలికాం సంస్థలు చాలావరకు 28 రోజుల వ్యాలిడిటీని ఇస్తుండగా, బీఎస్ఎన్ఎల్ పూర్తి నెలకు సరిపడా సమయాన్ని ఇస్తోంది. ఒకవేళ రోజువారీ డేటా కోటా పూర్తయితే, ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది కానీ కనెక్షన్ మాత్రం కొనసాగుతుంది.
డేటాతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ మాట్లాడుకునే సౌకర్యం, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి.
