శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2017 (15:51 IST)

దుబాయ్‌లో ఆ 11 రకాల ఫుడ్ ఐటెమ్స్‌పై నిషేధం...

ముస్లిం సంప్రదాయాలు అత్యంత నియమనిష్టలతో అమలు చేసే అరబ్ దేశాల్లో దుబాయ్ ఒకటి. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక ఆహార పదార్థాలు మనుషుల్లో వివిధ రోగాలకు మూలకారణంగా ఉంటున్నాయి.

ముస్లిం సంప్రదాయాలు అత్యంత నియమనిష్టలతో అమలు చేసే అరబ్ దేశాల్లో దుబాయ్ ఒకటి. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక ఆహార పదార్థాలు మనుషుల్లో వివిధ రోగాలకు మూలకారణంగా ఉంటున్నాయి. ఏమాత్రం న్యూట్రిషన్స్ లేకుండా తయారు చేస్తున్న ఫుడ్ ఐటెమ్స్‌పై యూఏపీ సర్కారు నిషేధం విధించింది. దీనికి కారణం లేకపోలేదు. 
 
దుబాయ్‌లోని వివిధ స్కూళ్లల్లో చదువుతున్న పిల్లల్లో మెజారిటీ శాతం మంది ఎక్కువ బరువు సమస్యతో బాధపడుతున్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. దీంతో ఎక్కువ బరువు పెరిగేందుకు కారణాలైన 11 ఆహార పదార్థాల జాబితాను ప్రకటించి.. వాటిని స్కూళ్లల్లోని క్యాంటీన్స్‌లో విక్రయించకుండా నిషేధం విధించింది. 
 
తద్వారా భావితరాలకు డయాబెటిస్, స్థూలకాయం వంటి సమస్యల నుంచి కాపాడొచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా స్కూళ్లలోని క్యాంటీన్లలో పరిశుభ్రతను పాటించాలని, సేఫ్టీ రూల్స్‌ను అతిక్రమించకూడదని తేల్చిచెప్పారు. కాగా దుబాయ్ ప్రభుత్వం నిషేధం విధించిన ఆహార పదార్థాల జాబితాలో ఈ కింది ఫుడ్‌ఐటెమ్స్ ఉన్నాయి. 
 
1. అధిక చక్కెరను కలిగిన రంగురంగుల స్వీట్లు 
2. కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసే పాలు, పెరుగు
3. అన్ని రకాల పండ్ల రసాలు
4. చూయింగ్ గమ్, కాండీస్ 
5. బోఫక్(స్పెషల్ చిప్స్) 
6. ఎనర్జీ డ్రింక్స్
7. ప్లెయిన్ చాకోలెట్
8. మోనోసోడియం గ్లుటేమేట్‌ను కలిగిన ఆహార పదార్థాలు.. టొమాటోతో చేసేవి, జున్ను వంటివి..  
9. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు
10. అన్ని రకాల చిప్స్
11. అన్ని రకాల సాఫ్ట్‌డ్రింక్‌లు.