బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 25 మే 2017 (17:29 IST)

ఖతార్ అమ్మాయి.. బెంగళూరు అబ్బాయి లవ్ స్టోరీ- కలిపేందుకు వచ్చిన ముగ్గురు పాకిస్థానీయులు..

బెంగళూరులో ముగ్గురు పాకిస్థానీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖతార్ నుంచి నేపాల్ మీదుగా అక్రమంగా వీరు వచ్చారని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్ సూద్ మీడియాతో చెప్పారు. కరాచీకి చెందిన యువతి కిరణ్ గుల

బెంగళూరులో ముగ్గురు పాకిస్థానీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖతార్ నుంచి నేపాల్ మీదుగా అక్రమంగా వీరు వచ్చారని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్ సూద్ మీడియాతో చెప్పారు. కరాచీకి చెందిన యువతి కిరణ్ గులామ్ సమీరా, కాసిఫ్ శంషుద్దీన్ ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఖతార్‌లోనే కేరళకు చెందిన మహమ్మద్ బషీర్ ఉద్యోగం చేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో కరాచి యువతి కిరణ్ గులామ్, కేరళ యువకుడు మహమ్మద్ బషీర్ ప్రేమించుకున్నారు. బషీర్, కిరణ్ వివాహానికి కిరణ్ గులామ్ కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. కానీ అయినా కిరణ్ గులామ్ తల్లిదండ్రులను ఎదిరించి కేరళకు చెందిన మహమ్మద్ బషీర్‌ను వివాహం చేసుకుందని ప్రవీణ్ తెలిపారు. ఆపై నకిలీ పాస్ పోర్టులతో కిరణ్ గులామ్, సమీరా, కాసిఫ్ శంషుద్దీన్ ఖతార్ నుంచి మస్కట్ మీదుగా నేపాల్ చేరుకున్నారు. నేపాల్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా భారత్‌లో ప్రవేశించి బెంగళూరులోని కుమారస్వామి లేఔట్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో నలుగురు నివాసం ఉంటున్నారు.
 
పాకిస్థాన్‌కు చెందిన ఈ ముగ్గురు, కేరళకు చెందిన మహమ్మద్ బషీర్ కుమారస్వామి లేఔట్ లోని ఓ అపార్ట్ మెంట్‌లో నివసిస్తున్నారు. ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాక్ యువతిని వివాహం చేసుకున్న మహమ్మద్ బషీర్ బెంగళూరులోనే ఎందుకు నివాసం ఉంటున్నాడు? ముగ్గురు పాకిస్థానీ జాతీయులు బెంగళూరులోనే ఎందుకు మకాం వేశారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే కిరణ్‌ను బషీర్‌తో కలిపేందుకు వారి ప్రేమకు సహకరించేందుకే ఖతార్ నుంచి బెంగళూరు వచ్చామని చెప్తున్నారు.