సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 నవంబరు 2016 (12:22 IST)

లీక్డ్ సోర్స్.. 41కోట్ల మంది అక్రమ సంబంధాలు లీక్ అయ్యాయ్.. కొంపలు కొల్లేరవుతాయా?

యావత్తు భారత దేశాన్ని పెద్ద నోట్ల వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో, ప్రపంచాన్ని మరో వ్యవహారం కుదిపేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ లీక్ కలకలం సృష్టిస్తోంది. అయితే ఈ వ్యవహారం కుటుంబాల్లో చిచ్చు

యావత్తు భారత దేశాన్ని పెద్ద నోట్ల వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో, ప్రపంచాన్ని మరో వ్యవహారం కుదిపేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ లీక్ కలకలం సృష్టిస్తోంది. అయితే ఈ వ్యవహారం కుటుంబాల్లో చిచ్చురేపడం ఖాయమని తెలుస్తోంది. 2013లో 'మై స్పేస్'కి చెందిన 36 కోట్ల అక్రమ సంబంధాల ఎకౌంట్స్ లీకయ్యాయి. 
 
అక్రమ సంబంధాలు బట్టబయలు కావడంతో చాలామంది తమ భాగస్వాముల నుంచి విడిపోయారు. కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీని కంటే మించిన లీకేజీ ప్రస్తుతం జరిగిందని 41 కోట్ల మంది రాసలీలలు, అక్రమ సంబంధాలు తాజాగా వెలుగులోకి వచ్చాయని ఇంటర్నెట్ సెక్యూరిటీ లోపాల్ని బయటపెట్టే 'లీక్డ్ సోర్స్' అనే వెబ్‌ సైట్ ప్రకటించింది.
 
ఇంటర్నెట్ యూజర్లు పెరగడంతో పాటు సోషల్ మీడియాల ప్రాభవంతో ఆన్ లైన్ శృంగార సైట్లు పుట్టుకొచ్చాయి. దీంతో కొత్త అనుబంధాల కోసం చాలామంది వెంపర్లాడుతున్నారు. ఇలాంటి వారి కోసం నెలకొల్పిన అడల్ట్ ఫ్రెండ్ ఫైండర్.కామ్ వెబ్ సైట్‌లో రిజిస్టర్ అయిన 40,22,14,295 మంది యూజర్ల సమాచారం లీకైంది. ఇందులో యూజర్ల అక్రమ సంబంధాలు వెల్లడి అయ్యాయి. డేటాబేస్‌లో అనేకమంది అక్రమ సంబంధాలపై వివరాలున్నాయని లీక్డ్ సోర్స్ ప్రకటించింది. 
 
సాధారణంగా ఇలాంటి రహస్య సమాచార సేకరణ బ్లాక్ మెయిల్ చేసేందుకు యూజర్ల బర్త్‌ డేలు, ఐపీ అడ్రస్‌‌లు ఆధారం చేసుకుని జరుగుతుందని, అందుకే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే తాము హ్యాకర్స్ కామని.. నెట్లో సెక్యూరిటీ పరంగా ఉన్న సమస్యల్ని గుర్తించి ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం వరకే తమ పని అంటూ లీక్డ్ సోర్స్ వెల్లడించింది. సెక్యూరిటీ పరమైన సమస్యల కోసం వీటిని హ్యాక్ చేశామని లీక్డ్ సోర్స్ పేర్కొంది.