మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2016 (13:21 IST)

నేను బరిలోవుండి ఉంటే ట్రంప్‌ను ఓడించేవాడినే.. బరాక్ ఒబామా

అమెరికా అధ్యక్ష బరిలో తమ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్ కాకుండా తాను ఉండివుంటే.. ఖచ్చితంగా ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించేవాడినని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. సీఎన్‌ఎన్‌ ఎనలిస్ట్‌ అయిన

అమెరికా అధ్యక్ష బరిలో తమ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్ కాకుండా తాను ఉండివుంటే.. ఖచ్చితంగా ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించేవాడినని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. సీఎన్‌ఎన్‌ ఎనలిస్ట్‌ అయిన డేవిడ్‌ యాక్స్ లార్డోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
తాను మళ్లీ ఎన్నికల బరిలో నిలిచి ఉంటే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ గెలిచేవారు కాదన్నారు. అదేసమయంలో హిల్లరీ క్లింటన్‌ ప్రచారంలో ఎటుంటి లోపం లేదన్నారు. ఏది ఏమైనప్పటికీ హిల్లరీ.. ట్రంప్‌ చేసిన వాగ్దానాలపై భవిష్యత్తులో దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 
 
బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలపై కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ స్పందించారు. ''ఉద్యోగాల సంక్షోభం, ఐఎస్‌ఐఎస్‌, ఒబమా కేర్‌ వంటి అంశాలను పెట్టుకొని ఇంకా గెలుస్తాడని ఆయన భావిసున్నారా? నేనైతే ఆయన గెలుస్తాడనుకోవడం లేదు'' అని వ్యాఖ్యానించారు.