గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 జులై 2017 (16:20 IST)

పడక గదిలోకి వెళ్లిన బాలుడు... దృశ్యాన్ని చూసి షాక్...

పడక గదిలోకి వెళ్లిన ఓ బాలుడికి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి భారీ షాక్‌కు గురయ్యాడు. అలస్కాలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 11 యేళ్ళ జాచ్ లాండీస్ అనే బాలుడు... తన స్నేహితులతో ఆడుకుని

పడక గదిలోకి వెళ్లిన ఓ బాలుడికి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి భారీ షాక్‌కు గురయ్యాడు. అలస్కాలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 11 యేళ్ళ జాచ్ లాండీస్ అనే బాలుడు... తన స్నేహితులతో ఆడుకుని ఇంటికి వచ్చాడు. కాళ్లు, చేతులూ కడుక్కుని తన బెడ్‌రూంలోకి వెళ్లాడు. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. కేకలు వేస్తూ, ఏడుస్తూ గది నుంచి బయటకు ప్రాణభీతితో పరుగెత్తుకుంటూ వచ్చాడు. 
 
కారణం ఏంటంటే.. ఓ పెద్ద ఎలుగుబంటి బాలుడి పడక గదిలో ఉండటమే. కిటీకీ అద్దాలను పగలకొట్టి లోపలికి ప్రవేశించింది. బాలుడి అరుపులు విన్న ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గదిలోని సామాన్లను చెల్లాచెదురు చేసింది. గోడలను బలంతో కొట్టింది. ఈ క్రమంలో ఎలుగుబంటికి గాయాలయ్యాయి. కొద్దిసేపు బీభత్సం చేసిన తర్వాత ఆ ఎలుగుబంటి కిటికీ నుంచే బయటకు వెళ్లిపోయింది.