శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 మే 2016 (12:56 IST)

బెర్నీ సాండర్స్ చేతిలో హిల్లరీ క్లింటన్ ఓటమి.. డొనాల్డ్ ట్రంప్ విమర్శలు! ఏమన్నారు?

అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌.. వెస్ట్ వర్జీనియా ప్రైమరీలో ఆమె సొంత పార్టీ అభ్యర్థి బెర్నీ సాండర్స్ చేతిలో పరాజయం పాలైయ్యారు. ఇంతకుముందు ఇండియానాలో కూడా హిల్లరీ క్లింటన్ ఓడిపోయింది. వర్జీనియా వెస్ట్, నెబ్రాస్కాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకున్నారు.
 
బెర్నీ సాండర్స్ చేతిలో హిల్లరీ క్లింటన్ ఓడిపోయినప్పటికీ ఆమె మహిళా ఓట్లకు గాలం వేస్తున్నారు. ఓట్ల కోసం స్టోన్‌బిజ్‌లో ఓ కాఫీ హోటల్‌కు వెళ్లారు. అక్కడ కాఫీ తాగుతూ, సమోసా తింటూ... మహిళలతో ముచ్చటించారు. మహిళా హక్కులు, జీతాలు, ఫీజుల గురించి ఆమె చర్చించారు. తాను అమెరికా అధ్యక్షురాలునైతే సమస్యలకు పరిష్కారం చూపుతానని చెప్పారు.
 
అయితే రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. హిల్లరీ వ్యతిరేకించకపోవడం వల్లే ఆమె భర్త బిల్‌ క్లింటన్‌ చేతిలో అనేక మంది మహిళల జీవితాలు నాశనమయ్యాయని ఆరోపించారు.