శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (14:12 IST)

బుల్ ఫైట్.. ప్రాణాలు ఫణంగాపెట్టి ఎద్దులతో పోరాటం (Video)

సాధారణంగా వివిధ దేశాల్లో వివిధ రకాల క్రీడలు ఉన్నాయి. మన దేశంలోని తమిళనాడులో అయితే జల్లికట్టు పేరుతో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఇంకొన్ని దేశాల్లో ఈ ఎద్దుల పోటీలను ఓ ఉత్సవంలా జరుపుకుంటారు. కానీ, స్పెయిన్ ద

సాధారణంగా వివిధ దేశాల్లో వివిధ రకాల క్రీడలు ఉన్నాయి. మన దేశంలోని తమిళనాడులో అయితే జల్లికట్టు పేరుతో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఇంకొన్ని దేశాల్లో ఈ ఎద్దుల పోటీలను ఓ ఉత్సవంలా జరుపుకుంటారు. కానీ, స్పెయిన్ దేశం పేరు వింటే మాత్రం ఠక్కున గుర్తుకు వచ్చేది బుల్ ఫైట్. బాగా మదమెక్కిన ఎద్దులతో మనుషులు పోరాటానికి దిగే ఈ క్రీడకు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. బుల్ ఫైట్ అక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. ఎద్దులను రెచ్చగొట్టడం.. తిరిగి అదుపులోకి తెచ్చుకోవటం. 
 
అంటే ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ ఎద్దులతో పోరాటం చేస్తారు. మరోవైపు బుల్ ఫైట్ నిషేధించాలని పోరాటలు జరుగుతున్నా... కొన్నిచోట్ల యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బుల్ ఫైట్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.