1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (14:48 IST)

ఎలక్ట్రానిక్ టాయి‌లెట్‌ను దొంగిలించిన చైనా దంపతులు... ఎలా చిక్కారు?

చైనాకు చెందిన ఓ దంపతులు చేసిన పని అందరిముందు వారిని నవ్వులపాలు చేసింది. ఈ జంట ఇటీవల సరదా కోసం జపాన్ వెళ్లారు. అక్కడ ఒక హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. అయితే ఈ జంట ఆ గదిలో ఏం చేశారో తెలిస్తే ముక్క

చైనాకు చెందిన ఓ దంపతులు చేసిన పని అందరిముందు వారిని నవ్వులపాలు చేసింది. ఈ జంట ఇటీవల సరదా కోసం జపాన్ వెళ్లారు. అక్కడ ఒక హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. అయితే ఈ జంట ఆ గదిలో ఏం చేశారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... చైనాకు చెందిన లీ, అతని భార్య చెన్ ఇటీవల జపాన్‌లోని నగోయ వెళ్లి అక్కడి స్టార్ హోటల్‌లో బస చేశారు. వారు చైనాకు తిరిగోస్తుండగా వారి గదిలోని ఎలక్ట్రానిక్ టాయిలెట్ సీటును దొంగతనంగా ఎత్తుకొచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది గమనించాడు. వారిని గట్టిగా నిలదీశాడు. విషయం కాస్తా బయటపడి తమ పరువు కాస్తా బజారుకెక్కడంతో చైనాకు తిరిగొచ్చిన జంట తిరిగి ఆ టాయిలెట్ సీటును నగోయా హోటల్‌‌కు పార్సిల్ చేసింది. 
 
దొంగతనం చేసినందుకు క్షమాపణలు చెప్పారు. చైనాలో ఎలక్ట్రానిక్ టాయిలెట్ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉండడం, అయినా అవి దొరకకపోతుండడంతో జపాన్ వచ్చే చైనీయులు వాటిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. అయితే ఈ జంట మాత్రం కాస్త డిఫరెంటుగా ఆలోచించి బస చేసిన హోటల్‌లోని టాయిలెట్ సీటును ఎత్తుకొచ్చేసింది. నలుగురికి ఈ విషయం తెలియడంతో సిగ్గుతో తల వంచుకున్నారు.