1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2016 (10:26 IST)

కొలంబియాలో విమాన ప్రమాదం ఇంధనం అయిపోవడం వల్లే...

ఇంధనం నిండుకోవడం వల్లే కొలంబియాలో విమాన ప్రమాదం జరిగినట్టు దర్యాప్తు అధికారులు తేల్చారు. గత నెల 29వ తేదీన ఈ ప్రమాదం జరుగగా, మొత్తం 71 మంది చనిపోయారు. మృతిచెందిన వారిలో 19 మంది బ్రెజిల్‌కు చెందిన చెపకొ

ఇంధనం నిండుకోవడం వల్లే కొలంబియాలో విమాన ప్రమాదం జరిగినట్టు దర్యాప్తు అధికారులు తేల్చారు. గత నెల 29వ తేదీన ఈ ప్రమాదం జరుగగా, మొత్తం 71 మంది చనిపోయారు. మృతిచెందిన వారిలో 19 మంది బ్రెజిల్‌కు చెందిన చెపకొయిన్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ క్రీడాకారులు, సిబ్బంది ఉన్నారు. 
 
ఈ విమాన ప్రమాదంపై జరిపిన విచారణలో ఇంధనం అయిపోవడం మూలంగానే ప్రమాదం జరిగిందని కొలంబియన్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ అధికారులు గుర్తించారు. విమానం మెడిలిన్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే సమయంలో సమీపంలోని కొండల్లో కూలిపోయింది. ప్రాథమిక దర్యాప్తులో ఇంధనం అయిపోవడంతో పాటు.. విమానం నిర్ధేశించిన దానికన్నా ఓ 500 కిలోలు ఎక్కువ బరువుతో వెళ్తున్నట్లుగా కూడా గుర్తించామని అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు.
 
ప్రమాదంలో మృతి చెందిన విమాన పైలట్‌ మిగుయల్‌ కైరోగా.. ఎమర్జెన్సీ ప్రకటించడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడని ఎయిర్‌లైన్స్‌ సెక్యూరిటీ సెక్రెటరీ ఫ్రెడ్డీ బొనిల్లా తెలిపారు. కూలిపోవడానికి కేవలం రెండు నిమిషాల ముందే విమానం పూర్తిగా ఫెయిల్‌ అయిన విషయాన్ని పైలట్‌ రిపోర్ట్‌ చేశాడని ఆయన తెలిపారు.