1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Death toll from China storms rises to 20

చైనాలో కుండపోతగా వర్షాలు.. విషపూరిత పాములు.. వరదలతో భయం భయం (video)

China Rains
China Rains
చైనాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వరదల ఉధృతికి ఒక పాముల పెంపక కేంద్రం పూర్తిగా దెబ్బతింది. దీంతో దాదాపు 900 పాములు ఒక్కసారిగా బయటకు తప్పించుకున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 
 
దక్షిణ చైనా పరిధిలోని ఒక గ్రామీణ ప్రాంతంలో ఈ వింతైన, భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఈ తప్పించుకున్న పాములలో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాలు తీసే విషపూరిత జాతులు కూడా ఉన్నట్లు స్థానిక చైనీస్ మీడియా వెల్లడించింది. వందల సంఖ్యలో పాములు గ్రామ పరిసరాల్లోకి, ఇళ్ల సమీపంలోకి చేరడంతో స్థానిక యంత్రాంగం, విపత్తు నిర్వహణ అధికారులు తీవ్రంగా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఫామ్ నుంచి తప్పించుకున్న పాములు గ్రామంలోని కొందరిని కాటేసినట్లు సమాచారం అందుతోంది.
 
మరోవైపు, ఈ అకాల వరదల ధాటికి ఆ ప్రాంతంలో వందలాది ఇళ్లు దెబ్బతినడంతో పాటు భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఒకవైపు వరద నీరు, మరోవైపు ప్రాణాంతక పాముల భయంతో స్థానిక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. 
 
రికార్డు స్థాయిలో దాదాపు 74.5 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నానింగ్ నగరంలో రిజర్వాయర్లు తెగిపోవడంతో రోడ్లపై వందలాది కార్లు కొట్టుకుపోతున్నాయి. 
 
ఇప్పటికే భారీ వరదల కారణంగా 15మంది మృతి చెందగా దాదాపు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఓడిన కన్నప్రేమ - కుమార్తె కాళ్లపై పడినా కనికరించలేదు... (వీడియో)