సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (12:49 IST)

లైవ్‌లో మహిళా జర్నలిస్టు... పిరుదుపై కొట్టి పారిపోయిన అకతాయి.. (Video)

లైవ్‌లో ఓ మహిళ పట్ల ఓ అకతాయి అసభ్యంగా ప్రవర్తించాడు. తన వృత్తిలో భాగంగా ఆమె లైవ్‌లో నిమగ్నమైవుండగా ఓ పోకిరి ఆమె పిరుదుపై కొట్టి పారిపోయాడు. ఈ అనుకోని చర్యతో ఆ జర్నలిస్టు ఒకింత షాక్‌కు గురైంది. ఈ ఘటన జార్జియాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జార్జియాలోని సవ్హానా ప్రాంతంలోని ఓ వంతెన వద్ద ఓ కార్యక్రమంపై అవగాహనా కార్యక్రమం నిమిత్తం రన్ ర్యాలీ జరిగింది. ఇందులో అనేక మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీఎస్ఏవీ టీవీ జర్నలిస్టు అలెక్స్ బోజర్జియాన్ అనే మహిళా జర్నలిస్టు లైవ్‌లో కవర్ చేస్తూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. 
 
అయితే, ఈ ర్యాలీలో పాల్గొన్న పలువురు టీవీలో కనపడాలన్న ఉత్సాహంతో ఓ మహిళా జర్నలిస్టు వెనుక నుంచి 'హాయ్' చెబుతూ వెళ్లారు. ఓ వ్యక్తి మాత్రం ఆ మహిళా జర్నలిస్టు నడుముపై కొట్టి వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో ఆమె షాక్ అయింది. అయినప్పటికీ తన లైవ్ కవరేజ్‌ను కొనసాగించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
 
ఈ చర్యకు పాల్పిన వ్యక్తిని థామస్ కల్లావె(43)గా పోలీసులు గుర్తించారు. అతడిపై లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి చర్యలను తాము ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. ఈ చర్యకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు దీన్ని 11 మిలియన్ల మంది చూశారు.