డోనాల్డ్ ట్రంప్ ఎక్కడున్నారు? దాడులపై ఆయన స్పందించాలి : హిల్లరీ క్లింటన్
దేశంలో జరుగుతున్న జాత్యహంకార దాడులపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించాలని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ డిమాండ్ చేశారు. ఈ దాడుల కారణంగా అమెరికాలోని ప్రవాసీయులంతా భయాందోళనల్లో ఉన్నార
దేశంలో జరుగుతున్న జాత్యహంకార దాడులపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించాలని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ డిమాండ్ చేశారు. ఈ దాడుల కారణంగా అమెరికాలోని ప్రవాసీయులంతా భయాందోళనల్లో ఉన్నారనీ, ఇలాంటి సమయాల్లో అధ్యక్షుడు వారికి అండగా నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు.
శ్వేతజాతీయుడు ప్యూరింటన్ జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందాడు. ఇదే దాడిలో మరో తెలుగు యువకుడు అలోక్ గాయపడ్డాడు. దీనిపై హిల్లరీ క్లింటన్ స్పందిస్తూ జాతి వివక్ష దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశాలపై దేశాధ్యక్షుడు ట్రంప్ మాట్లాడాలని ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా డిమాండ్ చేశారు.
జాతి వివక్ష దాడులు జరుగుతున్నాయని అధ్యక్షుడికి చెప్సాల్సిన అవసరం లేదని, కానీ అలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధ్యక్షుడు ముందుకు వచ్చి, ప్రజలకు అండగా మాట్లాడాలని హిల్లరీ అన్నారు. కాన్సస్‌లో జరిగిన కాల్పుల ఘటనపై దేశాధ్యక్షుడు ట్రంప్ ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. కానీ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ మాత్రం ఆ కాల్పుల ఘటనను హేట్ క్రైమ్‌గా చిత్రీకరించడాన్ని ఆమె వ్యతిరేకించారు.