ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 మే 2017 (08:21 IST)

పాకిస్థాన్‌కు చుక్కెదురు.. కుల్ భూషన్ సింగ్ ఉరిశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌‌కు మరోమారు చుక్కెదురైంది. గూఢచారి ముద్ర వేసి ఉరిశిక్ష విధించిన భారత నేవీ మాజీ ఉద్యోగి కుల్ భూషణ్ జాదవ్ ఉరిపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. గూఢచర్యానికి పాల్పడ్

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌‌కు మరోమారు చుక్కెదురైంది. గూఢచారి ముద్ర వేసి ఉరిశిక్ష విధించిన భారత నేవీ మాజీ ఉద్యోగి కుల్ భూషణ్ జాదవ్ ఉరిపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. గూఢచర్యానికి పాల్పడ్డాడని పాక్ ఆర్మీ న్యాయస్థానం ఆరోపిస్తూ, అతనికి ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అదేసమయంలో పాకిస్థాన్‌లోని న్యాయవాదులెవరూ అతని తరపున వాదించకూడదని నిర్ణయించారు. 
 
ఈ నేపథ్యంలో భారత్ ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఆఫ్ఘనిస్థాన్ వ్యాపార పనిమీద వెళ్లిన కుల్ భూషన్ జాదవ్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, పాక్ సైన్యానికి విక్రయించారని, ప్రతిగా ఉగ్రవాదులను విడిపించుకుని, నిధులు పొందారని ఆరోపించింది. ఈ మేరకు అవసరమైన సాక్ష్యాలు అంతర్జాతీయ న్యాయస్థానంలో చూపించడంతో కుల్ భూషణ్ జాదవ్‌పై పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. దీంతో పాక్ షాక్ తింది. 
 
కాగా, గూఢాచార్యం చేస్తున్నాడంటూ జాదవ్‌కు ఏప్రిల్ 10న  పాకిస్థాన్ మిలిటరి కోర్టు ఉరిశిక్ష విధించింది. పాక్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. దీంతో కొంత వెనక్కి తగ్గిన పాక్... అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడంతో భారత్ శరవేగంగా స్పందించి.. కుల్ భూషన్ ప్రాణాలు కాపాడే చర్యలు చేపట్టి, విజయం సాధించింది.