జేషే చీఫ్ మసూద్ అజహర్ ఉగ్రవాదే : తొలిసారి నిజం చెప్పిన ముషారఫ్
జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ముమ్మాటికీ ఉగ్రవాదేనని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చెప్పుకొచ్చారు. ఈ తరహా వ్యాఖ్యలు ముషారఫ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ముమ్మాటికీ ఉగ్రవాదేనని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చెప్పుకొచ్చారు. ఈ తరహా వ్యాఖ్యలు ముషారఫ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
పాకిస్థాన్ టీవీ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ముషారఫ్ మాట్లాడుతూ... ఇదేసమయంలో, మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు చైనాను ఒప్పిస్తారా? అన్న ప్రశ్నకు మాత్రం ముషార్రఫ్ సూటిగా సమాధానం చెప్పలేదు.
మసూద్‌తో చైనాకు సంబంధం లేదని, అసలు ఈ విషయంలో చైనా తలదూర్చాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కాగా, ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకు మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించే అంశం రాగా, చైనా తన వీటో హక్కుతో అడ్డుకున్న సంగతి తెలిసిందే.