సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జూన్ 2024 (09:20 IST)

ఖురాన్‌ను అవమానించాడని.. టూరిస్టును హత్య చేసి నిప్పంటించేశారు..

fire accident
పాకిస్థాన్‌లో టూరిస్ట్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ముస్లింల పవిత్రగ్రంథం ఖురాన్‌ను అవమానించాడన్న ఆరోపణతో 36 ఏళ్ల టూరిస్టును చంపేసి, ఆపై మృతదేహానికి నిప్పుపెట్టింది ఓ గ్యాంగ్. పర్యాటక ప్రాంతమైన మద్యాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు 280 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పంజాబ్‌(పాక్)లోని సియోల్‌కోట్‌కు చెందిన మృతుడి వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. పోలీసులకు చుక్కలు చూపించిన యువకుల గుంపు పోలీస్ స్టేషన్ నుంచి యువకుడిని ఈడ్చుకొచ్చి దాడిచేసి చంపేశారు. ఆ తర్వాత మృతదేహానికి నిప్పుపెట్టారు. ఈ ఘటన కలకలం రేపింది.