అట్లాంటిక్ సముద్రంపై ప్రసవం... ప్రయాణికులను ముందుకు పంపి.. వెనుక కానిచ్చేశారు..
ఓ మహిళ నింగిలో అదీ కూడా భూమికి 39 వేల అడుగుల ఎత్తులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం ఎల్‌హెచ్ 543 కొలంబియాలోని బోగోటా నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరింది. ఈ విమా
ఓ మహిళ నింగిలో అదీ కూడా భూమికి 39 వేల అడుగుల ఎత్తులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం ఎల్‌హెచ్ 543 కొలంబియాలోని బోగోటా నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరింది. ఈ విమానం నింగిలో భూమికి 39,000 అడుగుల ఎత్తున రయ్‌మంటూ దూసుకెళుతోంది.
ఈ విమానంలో నిండు గర్భంతో ఉన్న 38 ఏళ్ల ప్రయాణికురాలు కూడా ప్రయాణం చేస్తోంది. ఈమెకు అకస్మాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. దీంతో వెంటనే ఆ విమానాన్ని మాంచెస్టర్‌కు దిశ మార్చారు. అదృష్టవశాత్తూ అదే విమానంలో ముగ్గురు డాక్టర్లు ఉండటం ఆ మహిళకు వరంగా మారింది.
వైద్యులు, క్యాబిన్ సిబ్బంది సాయంతో మహిళకు సుఖ ప్రసవం చేశారు. మగ శిశువు విమానంలో కళ్లు తెరిచాడు. సదరు మహిళ పేరు దేశిస్ లావా కాగా, పూర్తిగా నెలలు నిండక ముందే ప్రసవం జరిగింది. విమానంలో ప్రయాణికులను ముందుకు పంపి, వెనుక వైపు ప్రసవం కానిచ్చేశారు.