బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (10:09 IST)

ఉత్తర కొరియా మరో అణు పరీక్ష : 5.3 తీవ్రతతో భూకంపం

ఉత్తర కొరియా మరోమారు అణు పరీక్ష నిర్వహించింది. ఆ దేశం నిర్వహించిన ఐదో పరీక్షగా భావిస్తున్నారు. దీంతో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర కొరియా ప్రధాన న్యూక్లియర్ సైట్ సమీపంలో శుక్రవారం రిక్టర్ స్క

ఉత్తర కొరియా మరోమారు అణు పరీక్ష నిర్వహించింది. ఆ దేశం నిర్వహించిన ఐదో పరీక్షగా భావిస్తున్నారు. దీంతో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర కొరియా ప్రధాన న్యూక్లియర్ సైట్ సమీపంలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపాన్ని గుర్తించినట్లు దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. 
 
అయితే, ఖచ్చితంగా అది న్యూక్లియర్ టెస్ట్ మూలంగా సంభవించిన భూకంపంగా ఉత్తర కొరియా వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ భూకంపానికి సంబంధించిన ప్రకంపనలను అమెరికా, యూరప్ భూకంప పరిశీలన కేంద్రాలు సైతం గుర్తించాయి. ఉత్తర కొరియా ఫౌండేషన్ డే సందర్భంగా ఈ పరీక్షలు నిర్వహించింది. దీనిపై ఉత్తర కొరియా ఎలాంటి ప్రకటన చేయలేదు.