శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:29 IST)

అమెరికాలో వేప పుల్ల ధర రూ.1800.. ఆర్గానిక్ టూత్ బ్రష్‌గా మార్చి..?

వేపపుల్లతో అనేక ఔషధ గుణాలున్నాయి. అందుకని దీనితో రోజూ దంతాలను తోముకుంటే చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు నోటి దుర్వాసనని కూడా నివారిస్తుంది. నోటి దుర్వాసన వస్తున్న వారు రోజు వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవాలి.. అయితే ముందుగా వేప పుల్లని బాగా నమిలి.. ఆ రసాన్ని పిక్కిలి పట్టాలి.. తర్వాత పండ్లను తోమాలి.. ఇలా రోజు చేస్తే.. నోటి దుర్వాసన పోతుంది.. సూక్ష్మక్రిములు చేరకుండా రక్షణ కల్పిస్తుంది. 
 
అయితే ఆధునికత పేరుతో మన పూర్వకాలం పద్దతులను, అలవాట్లను పక్కకు పెట్టినట్లు.. వేప పుల్లల్ని కూడా పక్కకు పెట్టాం.. పళ్ళు తోముకోవడం కోసం టూత్ పేస్టులు వచ్చాయి. కానీ విదేశీయులు మాత్రం టూత్ పేస్టులను పక్కకు పెట్టి.. వేపపుల్లల బాట పట్టారు. మనకు ఉచితంగా దొరికే వేపపుల్లలు.. అమెరికాలో కొనుక్కుని మరీ వాడుతున్నారు. 
 
అమెరికాలో మాత్రం ఒక వేప పుల్లను ఎంతకు విక్రయిస్తున్నారో తెలుసా ? అక్షరాలా రూ.1800. అవును. అమెరికాలో వేప పుల్లలను ఆర్గానిక్ టూత్ బ్రష్‌గా మార్చి ఒక్కో పుల్లను 24.63 డాలర్లకు అమ్ముతున్నారు. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.1800 అన్నమాట. వేప పుల్లలను నీమ్ ట్రీ ఫామ్స్ అనే ఈ-కామర్స్ కంపెనీ విక్రయిస్తోంది. వాటిని సుందరంగా ముస్తాబు చేసిన ప్యాక్‌‌లో పెట్టి మరీ అమ్ముతున్నారు.
 
విదేశీయులకు వేపపుల్ల విలువ తెలిసింది. కనుకనే అంత ధర పెట్టి మరీ వాటిని కొంటున్నారు. మనకు ఉచితంగానే అందుబాటులో ఉన్నా ఆరోగ్యాన్నిచ్చే వేపపుల్లని పక్కకు పెట్టి… అనారోగ్యాలను ఇచ్చే టూత్ పేస్ట్ లను కొని మరీ వాడుతున్నాం.