బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2017 (10:48 IST)

కిమ్ జాంగ్‌పై అమెరికా భారీ అస్త్రం-బలూచిస్థాన్‌లో 400 మంది ఉగ్రవాదులు లొంగిపోయారట!?

అణు ఆయుధాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉత్తరకొరియాను అమెరికా టార్గెట్ చేసిన సంగతి తెలిసింది. ఇంకా అణ్వాయుధ పరీక్షలతో తనను లక్ష్యం చేస్తున్న కిమ్ జాంగ్‌పై అమెరికా భారీ అస్త్రాన్ని ప్రయోగించింది. తమ

అణు ఆయుధాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉత్తరకొరియాను అమెరికా టార్గెట్ చేసిన సంగతి తెలిసింది. ఇంకా అణ్వాయుధ పరీక్షలతో తనను లక్ష్యం  చేస్తున్న కిమ్ జాంగ్‌పై అమెరికా భారీ అస్త్రాన్ని ప్రయోగించింది. తమ దేశం నుంచి ఉత్తర కొరియాకు ఇప్పటివరకూ చేస్తున్న ఎగుమతులను నిలిపివేయాలని నిర్ణయించింది. తక్షణమే ఈ నిర్ణయాన్ని అనుసరించాలని అధికారులకు సూచించింది. దీంతోపాటు ఆదేశంతో వ్యాపార సంబంధాలపై అమెరికన్ కంపెనీలు పునరాలోచించుకోవాలని ప్రభుత్వం సూచించింది. 
 
ఇకపై ఆ దేశంతో వ్యాపారంతోపాటు ఇతర ఏ సంబంధాల విషయాలపైనా సంబంధాలు పెట్టుకుంటే ఆ కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించింది. తమ దేశానికి చెందిన విద్యార్థికి ఉత్తర కొరియా 15 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్ని అమెరికా సీరియస్‌గా తీసుకుంది. అతడిని తక్షణమే విడుదల చేయాలని ఉత్తర కొరియా దౌత్యవేత్తలను కోరింది.
 
ఇదిలా ఉంటే.. వరుస ఉగ్రవాడులతో అట్టుడుకుతున్న పాకిస్థాన్‌లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సుమారు 400 మంది ఉగ్రవాదులు తమ ఆయుధాలను వదిలేసి, జనజీవన స్రవంతిలో కలసిపోయారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.