శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (17:14 IST)

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల వేట ప్రారంభం... రంగంలోకి దిగిన ఆర్మీ

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల వేట ప్రారంభమైంది. తీవ్రవాదుల కోసం ఆ దేశానికి చెందిన సైనికులు ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉన్నట్టుండి ఈ తరహా వైఖరి రావడం వెనుక అమెరికా ఒత్తిడో.. స్వదేశంలో ఉగ్రవా

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల వేట ప్రారంభమైంది. తీవ్రవాదుల కోసం ఆ దేశానికి చెందిన సైనికులు ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉన్నట్టుండి ఈ తరహా వైఖరి రావడం వెనుక అమెరికా ఒత్తిడో.. స్వదేశంలో ఉగ్రవాదులు సృష్టిస్తున్న మారణహోమం ఫలితమో తెలియదు. మొత్తంమీద తమ గడ్డపై ఉన్న ఉగ్రవాదుల ఏరివేతకు మాత్రం పాకిస్థాన్ నడుంబిగించింది. 
 
పంజాబ్ పోలీసులు, రేంజర్లు కలిసి రావల్పిండి, లయహ్ ప్రాంతాల్లో నిర్వహించిన విస్తృత దాడుల్లో 600 మందికిపైగా అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. 200 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ ఉగ్రవాదుల భరతం పట్టారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పాక్ రేంజర్లకు అనుమానిత ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 
 
ఇటీవల పాక్‌ సింధు ప్రాంతంలోని సూఫీ ప్రార్థనా మందిరంపై జరిగిన ఉగ్రదాడిలో 80కి మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 250మందికి పైగా గాయపడ్డారు. దీంతో అప్పటికప్పుడే ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్మీ 40 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెల్సిందే.