1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 14 మే 2025 (20:28 IST)

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

Balochistan declared as independent country
పాకిస్తాన్ దేశం పనికిమాలిన పనులు చేస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దేశ ప్రజల అభివృద్దిని గాలికి వదిలేసింది. తీవ్ర వాదానికి మద్దతు ఇస్తూ పాకిస్తాన్ ప్రజల మౌలిక అవసరాల గూర్చి పట్టించుకోవడం మానేసింది. ఎంతసేపటికి LOC దగ్గరకి ముష్కరులను పంపిస్తూ దొంగదెబ్బలు తీస్తూ పైశాచికానందం పొందుతూ వచ్చింది. మొన్నటి పహెల్గాం దాడి తర్వాత భారతదేశం పాక్ పైన విరుచుకుపడి నడ్డి విరిచింది. దీంతో ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
 
ఇప్పుడు దీనితో పాటు పాకిస్తాన్ దేశంలో 40 శాతం భూభాగం కలిగి వున్న బలూచిస్తాన్ ప్రాంతం తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని పాకిస్తాన్ దేశానికి షాకిచ్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నో ఏళ్లుగా తమకు ప్రత్యేక దేశం కావాలనీ, విభజించమని పాకిస్తాన్ పైన పోరాడుతూ వస్తోంది. తాజాగా పాకిస్తాన్ వెన్ను విరగడంతో బలూచిస్తాన్ బుధవారం నాడు తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నది. అంతేకాదు... తమ జాతీయ పతాకంతో, రాజధాని నగరం, పార్లమెంటు అన్ని విషయాలను చకచకా చెప్పేస్తోంది.
 
తమ దేశానికి చెందిన రాయబార కార్యాలయాలకు అనుమతి ఇవ్వాలంటూ భారతదేశంతో సహా ఇతర దేశాలకు సందేశాలను కూడా పంపేసింది. తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ అటు భారతదేశంతో పాటు ఐక్యరాజ్య సమితిని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కోరుతోంది. మరి ఈ వ్యవహారంపై పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.