బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (14:38 IST)

పెంపుడు కుక్క కోసం... ఎలుగుబంటితో ఫైట్ చేసింది.. చివరికి..?

తనకు ఇష్టమైన పెంపుడు శునకం కోసం.. అమెరికా టీనేజి అమ్మాయి ఎలుగుబంటితో ఫైట్ చేసింది. తన ఇంట్లో ప్రవేశించిన ఓ పెద్ద ఎలుగుంటి తన కుక్కపిల్లలపై దాడికి యత్నిస్తుంటే, సివంగిలా ముందుకు దూకిన ఆ అమ్మాయి తన కుక్కపిల్లలను కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో టిక్ టాక్ లోనూ, ఇతర సోషల్ మీడియా వేదికలపైనా వైరల్ అవుతోంది. 
 
కాలిఫోర్నియాకు చెందిన 17 ఏళ్ల హెయిలీ మోరినికో చేసిన సాహసం నెటిజన్లను అబ్బురపరుస్తోంది. హెయిలీ తన ఇంట్లో ఉన్న సమయంలో ఎలుగుబటి ఆమె ఇంటి పెరటి గోడ ఎక్కింది. దీన్ని చూసి కుక్కలన్నీ దానివెంటపడ్డాయి. 
 
ఎలుగుబంటి ఎంతో బలమైనది కావడంతో ఆ కుక్కలపై దాడికి దిగింది. ప్రమాదాన్ని గ్రహించిన హెయిలీ రాకెట్లా దూసుకువచ్చి, గోడపై ఉన్న ఎలుగుబంటిని తన చేతులతోనే ఎదుర్కొంది. దాన్ని గోడపై నుంచి బలంగా నెట్టివేయడంతో ఆ ఎలుగు అవతలికి పడిపోయింది. ఇదే అదనుగా హెయిలీ తన పెంపుడు కుక్కను చేతుల్లోకి తీసుకుని అక్కడ్నించి వచ్చేసింది. మొత్తానికి ఓ సూపర్ గాళ్‌గా గుర్తింపు తెచ్చుకుంది.