శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 30 మే 2017 (09:02 IST)

శక్తికి మించి మింగితే పామయినా సరే ఆహారాన్ని కక్కెయ్యక తప్పదు

గుడ్లను పొదుగుతున్న పక్షులు, పాములు గుడ్లనుంచి పిల్లలు బయటకు రాగానే విపరీతమైన ఆకలికి తట్టుకోలేక తాము పొదిగిన పిల్లల్నే నమిలేయడం కూడా తెలుసు. మరీ ముఖ్యంగా పాములు ఆహారంకోసం కప్పలను, ఇతర చిన్న జీవులను మి

చిన్న పామును పెద్దపాము మింగేయడం, చిన్న చేపను పెద్దచేప గుటుక్కుమనిపించడం ప్రకృతి సహజం. గుడ్లను పొదుగుతున్న పక్షులు, పాములు గుడ్లనుంచి పిల్లలు బయటకు రాగానే విపరీతమైన ఆకలికి తట్టుకోలేక తాము పొదిగిన పిల్లల్నే నమిలేయడం కూడా తెలుసు. మరీ ముఖ్యంగా పాములు ఆహారంకోసం కప్పలను, ఇతర చిన్న జీవులను మింగడం మనకు తెలుసు. కానీ ఒక పెద్ద పాము మరో పెద్ద పామును అమాంతంగా మింగేస్తే ఏమవుతుంది. ఏమీకాదు మింగబడిన పామును మింగిన పాము మళ్లీ కక్కేస్తుంది. అది బతికే ఉంటుంది కూడా. 
 
పామునోట్లోకి వెళ్లాక ఎలాంటి జీవి అయినా హరీమనాల్సిందేననేది మనకు తెలిసిన జ్ఞానం. కానీ క్రిస్టినోఫర్ రెనాల్డ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోను చూస్తే మాత్రం ఒళ్లు జలదరించిపోతుంది. ఆ వీడియోలో నలుపు రంగులో ఉన్న ఓ పెద్దపాము గోధుమ రంగులోని మరో పామును మింగేస్తుంది. 
 
సాధారణంగా అయితే ఇలా జరిగిన తరువాత ఆ గోధుమ రంగు పాము.. పెద్దపాముకు ఆహారమైపోవాలి. కానీ.. ఇక్కడే విచిత్రం చోటు చేసుకుంది. గోధుమ రంగు పామును పూర్తిగా మింగేసిన పెద్దపాము మళ్లీ దాన్ని బయటకు విడిచిపెట్టేసింది. అలా బయటకు వచ్చిన పాము సజీవంగానే ఉండటం విశేషం. 
 
 ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అయితే పాము మింగిన పాము మళ్లీ బతికి ఎలా బయటకు వచ్చింది అన్నదే సందేహం కదూ.. పాము తన శక్తికి మించిన పని చేస్తే ఇలాగే కక్కేస్తుంటుంది. చిన్న చిన్న జీవులను అమాంతం నోట్లో వేసుకుని చప్పరించే పాము తన కడుపు పరిమాణానికి పెద్దదిగా ఉండే జీవులను, తింటే మాత్రం అది అరిగించుకునే చాన్స్ లేక, కడుపులో పెట్టుకునే అవకాశమే లేక తిన్నదాన్ని మళ్లీ కక్కేస్తుంటుంది. 
 
పల్లెటూళ్లలో పొలాల వద్ద నీటిలో దాక్కుని ఉంటే పాములు పెద్ద పెద్ద కప్పలను మింగిసేనా వాటిని భరాయంచుకోలేక బయటకు కక్కడం ప్రజల అనుభవం.