శుక్రవారం, 4 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 నవంబరు 2016 (14:41 IST)

భారత్‌లో పెద్దనోట్ల రద్దు.. స్వీడెన్‌లో డిజిటల్ కరెన్సీ.. ప్రణాళికలు సిద్ధం.. కష్టాలు తప్పవా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో.. చిల్లర లేకపోవడంతో పాటు అవసరానికి తగిన డబ్బును పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుపై మనదేశంలో మిశ్రమ ఫలితాలు వస్త

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో.. చిల్లర లేకపోవడంతో పాటు అవసరానికి తగిన డబ్బును పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుపై మనదేశంలో మిశ్రమ ఫలితాలు వస్తున్న తరుణంలో పేపర్ కరెన్సీకి చెక్ పెట్టి.. డిజిటల్ కరెన్సీని  ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అది ఏ దేశమో తెలుసా? స్వీడెన్. ప్రపంచంలో తొలి పేపర్ కరెన్సీని 1660లోనే వినియోగంలోకి తెచ్చిన ఘనతను సంపాదించుకున్న స్వీడన్.. ప్రస్తుతం కరెన్సీ ఉపయోగంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనుంది. 
 
ఇందులో భాగంగా.. మరో రెండేళ్లలో డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. స్వీడన్ లో 2009 నాటికే ఆదేశ ప్రజల్లో దాదాపు 40 శాతం మంది క్రెడిట్ కార్డుల ద్వారా తమ లావాదేవీలు జరుపుతున్నారని ఓ సర్వేలో తేలింది. దీంతో ఆదేశ అధికారిక బ్యాంక్ అయిన రిక్స్ బ్యాంక్ త్వరలోనే డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రిక్స్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎసీలియా కింగ్స్లే తెలిపారు. 
 
కాగా క్రెడిట్ కార్డులను వినియోగించడంలో స్వీడన్ అగ్రస్థానంలో ఉందని, ఇలాంటి తరుణంలో ప్రజలకు ఈ-క్రోణా అనే డిజిటల్ కరెన్సీ  అందుబాటులోకి రావడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కింగ్స్ లే చెప్పారు. ఈ నూతన డిజిటల్ కరెన్సీ వల్ల దేశంలోని పేదలకు, గ్రామీణులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని, వాటి పరిణామాలను ముందుగానే అంచనా వేసిన తర్వాతే డిజిటల్ కరెన్సీని తేవాలని నిర్ణయించుకున్నట్లు ఆ దేశాధికారులు చెప్తున్నారు.