1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2016 (11:13 IST)

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌దే విజయం : ప్రొఫెసర్ జోస్యం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌దే అంతిమ విజయమని యూఎస్ ప్రొఫెసర్ అల్లాన్ లిచ్ మ్యాన్ బల్లగుద్ది చెపుతున్నాడు. ఈ ప్రొఫెసర్ 1984 నుంచి అమెరికన్ అధ్యక్ష ఎన్నికలపై తనదైన సర్వే ఫలితాలను వెల్లడిస

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌దే అంతిమ విజయమని యూఎస్ ప్రొఫెసర్ అల్లాన్ లిచ్ మ్యాన్ బల్లగుద్ది చెపుతున్నాడు. ఈ ప్రొఫెసర్ 1984 నుంచి అమెరికన్ అధ్యక్ష ఎన్నికలపై తనదైన సర్వే ఫలితాలను వెల్లడిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఆయన వెల్లడించిన సర్వే ఫలితాలు కూడా నిజమయ్యాయి కూడా. దీంతో తాజాగా వెల్లడించిన ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో హిల్లరీ క్లింటన్‌తో పోలిస్తే, ట్రంప్ తన అభ్యర్థిత్వానికి గట్టి పోటీ లేకుండానే బరిలోకి దిగడం, ప్రతినిధుల సభ మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ మరిన్ని సీట్లు గెలవడం, ట్రంప్ దూకుడు, అమెరికన్ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల పెరుగుతున్న భయం, వలసవాదుల నుంచి వస్తున్న ప్రమాదాలు... తదితరాలు ప్రజలు ఆయన్ను ఎంచుకునేందుకు సహకరిస్తున్నాయన్నారు. 
 
కాగా, నవంబర్ 8వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఆ రోజన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లలో ఒకరిని ఎన్నికోనున్నారు.