శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (12:49 IST)

360 అడుగుల ఎత్తైన విక్టోరియా జలపాతం అంచుపై మహిళ.. వీడియో వైరల్

victoria falls
victoria falls
360 అడుగుల ఎత్తైన విక్టోరియా జలపాతం అంచుపై ఓ మహిళ స్విమ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 19 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ క్లిప్‌ను ట్విట్టర్‌లో విర్డ్ అండ్ టెర్రిఫైయింగ్ పేజీ షేర్ చేసింది. జాంబియా-జింబాబ్వే సరిహద్దుల మధ్య ప్రపంచంలోని అతిపెద్ద జలపాతాలలో ఒకటైన విక్టోరియా జలపాతం అంచున ఒక పర్యాటకురాలు అంచున స్విమ్ చేస్తున్న వీడియోను చాలామంది వీక్షిస్తున్నారు. 
 
ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. జలపాతం అంచున ఆమె నిలవడంపై జనం జడుసుకుంటున్నారు. జలపాతం నుంచి కొట్టుకుపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. జారే రాళ్లపై ఇలాంటి హంట్ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో చూస్తే భయం వేస్తుందని చాలామంది అంటున్నారు. విక్టోరియా జలపాతానికి బ్రిటన్ రాణి విక్టోరియా పేరును డేవిడ్ లివింగ్‌స్టోన్ పెట్టారు.