శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 జులై 2017 (13:03 IST)

కన్నబిడ్డను బాత్రూం ఫ్లోర్‌పై వేసి కొట్టి చంపిన కసాయి తల్లి.. ఎక్కడ?

ఎవరికీ తెలియకుండా 9 నెలలపాటు గర్భంధరించిన ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆ బిడ్డను బాత్రూంలోకి తీసుకెళ్లి అత్యంత పాశవికంగా హత్య చేసింది. అబుదాబిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

ఎవరికీ తెలియకుండా 9 నెలలపాటు గర్భంధరించిన ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆ బిడ్డను బాత్రూంలోకి తీసుకెళ్లి అత్యంత పాశవికంగా హత్య చేసింది. అబుదాబిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ ఉపాధి కోసం యూఏఈలోని అబుదాబి నగరానికి వచ్చింది. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమె గర్భవతి అనే విషయాన్ని గుర్తించింది. గర్భవతి అనే విషయం ఆఫీసువారికి తెలిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారని భయపడింది. దీంతో 9 నెలల పాటు గర్భాన్ని రహస్యంగా మోసింది. ఉద్యోగస్థులకే కాదు రూమ్మేట్స్ కూడా తెలియనివ్వలేదు. 
 
కాన్సు నొప్పులను కూడా భరించింది. ఎవరికీ తెలియకుండా ఓ గదిలోకి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కన్నబిడ్డను బాత్‌రూంకు తీసుకెళ్లి తన చేతులతోనే చంపేసింది. బాత్రూం ఫ్లోర్‌పై కొట్టిచంపింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన ఓ ఉద్యోగి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వెంటనే అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. శిశువు, తల్లిని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే శిశువు మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. మహిళపై కేసు నమోదు చేశారు.