సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (13:06 IST)

ల్యాండవుతున్న విమానంలో నుంచి గుబుక్కున కిందికి దూకేసిన మహిళ... ఎక్కడ?

ఓ మహిళ ల్యాండవుతున్న విమానంలో నుంచి కిందికి దూకేసింది. ఈ సంఘటన హ్యూస్టన్‌ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన 1892 విమానం.

ఓ మహిళ ల్యాండవుతున్న విమానంలో నుంచి కిందికి దూకేసింది. ఈ సంఘటన హ్యూస్టన్‌ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన 1892 విమానం... న్యూఆర్లియన్స్‌ నుంచి హ్యూస్టన్‌కి వెళ్తున్న విమానం బుష్‌ ఇంటర్‌కాంటినెంటల్‌ విమానాశ్రయ రన్‌వేపై ల్యాండవుతోంది.
 
ఆ సమయంలో ఓ మహిళ ప్రయాణికురాలు విమానం అత్యవసర ద్వారం తెరిచి 15 అడుగుల ఎత్తు నుంచి దూకేసింది. ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటింగ్‌ ఏరియా వద్ద దూకేయడంతో అధికారులు వెంటనే మహిళని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మహిళతో పాటు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆమె విమాన సిబ్బందితో కానీ, తోటి ప్రయాణికులతో కానీ ఏమీ మాట్లాడకుండా అకస్మాత్తుగా అత్యవసర ద్వారం తెరిచి దూకేసిందని విమానంలోని ప్రయాణికులు చెప్పుకొచ్చారు.