1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Groom dies in road accident; brother marries the bride in Bihar

పెళ్లి చేసుకోవాల్సిన అన్నయ్య చనిపోయాడు, తమ్ముడు తాళి కట్టాడు, వీడియో

wedding
కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. జీవితాలు తల్లక్రిందులవుతుంటాయి. ఐనా మానవ జీవితంలో ఎపుడేమి జరుగుతుందో చెప్పనలవి కాదు. అవి మన చేతుల్లో కూడా వుండవు. కష్టనష్టాలను సహిస్తూ జీవితంలో ముందుకు సాగడమే మార్గం. బీహారు రాష్ట్రంలో తన సోదరుడు వివాహం చేసుకునేందుకు మండపానికి బయలుదేరగా మార్గమధ్యంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అతడు చనిపోయాడు.
 
ఈ హఠత్పరిణామానికి ఇరు కుటుంబాలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. మెడలో తాళి కట్టాల్సిన వరుడు ప్రాణాలు కోల్పోవడంతో వధువు శోకంలో మునిగిపోయింది. ఐతే అప్పటికప్పుడు వరుడు తరపు కుటుంబ సభ్యులు అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన వరుడు యొక్క సోదరుడితో వివాహం జరిపించాలని నిశ్చయించారు. దాంతో పెళ్లి రద్దు చేయకుండా అందరి అంగీకారంతో వధువును పెళ్లి చేసుకున్నాడు మృతుడి సోదరుడు.
 
వధువు భవిష్యత్తును కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వరుడి తరపు కుటుంబం వెల్లడించింది. ఐతే పెళ్లి వేదికపై ఆ బాధను జీర్ణించుకోలేకపోయారు వధువు మరియు మృతుడి సోదరుడు. ఈ ఘటన జరిగి నాలుగు నెలలైనప్పటికీ ఈ ఉద్వేగభరిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mid-day (@middayindia)

About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Ram Mohan Naidu: డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకాలు.. వైకాపా ఆరోపణలు అవాస్తవం