1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Siddugadi Love Story', created by Ramesh Babu Cherukuru, is ready.

రమేష్ బాబు చెరుకూరు చేసిన సిద్ధుగాడి లవ్ స్టోరీ సిద్ధమైంది

Siddhugadi Love Story relese desin
Siddhugadi Love Story relese desin
దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు. అమెరికాలో తన జాబ్ కొనసాగిస్తూనే, తెలుగు సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి “సిద్ధుగాడి లవ్ స్టోరీ” చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారిచెరుకూరు శివ బ్రహ్మిణి చెరుకూరు **సమర్పణలో, నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 27 న విడుదలకు సిద్దమవుతోంది 
 
ఈ చిత్రంలో హీరోగా మనోజ్ నటిస్తుండగా, హీరోయిన్లుగా శృతి, మోహన సిద్ధి నటిస్తున్నారు. హీరో తండ్రి పాత్రలో సుమన్, విలన్ పాత్రలో సర్కార్ నటిస్తున్నారు. ప్రముఖ హాస్యనటులు చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి 
 
దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ, తెలుగు సినిమా మీద ఉన్న ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. నా మనసులో ఉన్న సినిమా కలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. ప్రేక్షకుల ఆదరణ, ఆశీస్సులతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను” అలాగే టీజర్ మంచి రెస్పాన్స్ రావడంతో చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
 
సాంకేతికత: డి ఓ పి: దొసాడ యాదగిరి,  సంగీత దర్శకుడు: సీ యన్ ఆదిత్యా,  ఎడిటర్: లక్కీ ఎక్కరి
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
అటు భారత్, ఇటు పాక్. సైనికుడు నేపథ్యంతో ది ఇండియన్ బార్డర్