రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'
మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రం రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల పరంగా రెండోవారంలోనూ దూసుకెళుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఆగస్టు మొదటివారంలో విడుదలైన ఈ చిత్రం రెండోవారంలోనూ కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. ముఖ్యంగా, ఈ చిత్రం రెండో వారంలో నమోదు చేసిన టిక్కెట్ అమ్మకాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
'ఇరుముడి' చిత్రం రెండో వారంలోకి అడుగుపెటిన తర్వాత కూడా సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. దీనికి నిదర్శనంగా ప్రముఖ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షోలో రెండో శనివారం ఒక్క రోజే ఏకంగా రూ.3.76 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. సాధారణంగా రెండో వారంలో సినిమాల జోరు తగ్గుతుంది.
కానీ, 'ఇరుముడి'కి మాత్రం వారాంతం మొదలుకాగానే మళ్లీ పుంజుకుంది. రెండో వారంలో రోజువారీ టిక్కెట్ల అమ్మకాలను పరిశీలిస్తే, ఎనిమిదో రోజైన శుక్రవారం 3.34 లక్షల టిక్కెట్ల అమ్మకాలు జరుగగా, తొమ్మిదో రోజైన శనివారం ఆ సంఖ్య 3.76 లక్షలకు చేరడంతో సినిమాపై ఉన్న ఆసక్తిని స్పష్టం చేస్తోంది. వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే రెండో శనివారమే అత్యధిక టిక్కెట్లు అమ్ముడవడం విశేషం.
