1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actress Priya Bhavani Shankar tied the knot with her longtime boyfriend soon

పెళ్లిపీటలపై 'ఇరుముడి' హీరోయిన్ ప్రియా భవనీ శంకర్

priya bhavani shankar
నటి ప్రియా భవానీ శంకర్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు రాజ్‌తో ఆమె వివాహం నవంబరు 11వ తేదీన సన్నిహితుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో నెట్టింట వైరల్‌ అవుతుండగా.. అభిమానులు, ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రియ, రాజ్‌ ఇద్దరూ కాలేజీ రోజుల నుంచి స్నేహితులని.. పదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
 
సినిమాల విషయానికొస్తే.. తమిళంలో పలు సినిమాల్లో నటించిన ప్రియ.. స్టార్‌ హీరోలకు జోడీగా నటించి మెప్పించారు. కమల్ హాసన్ 'భారతీయుడు-2'నూ ఓ చిన్న పాత్రను పోషించారు. సంతోష్ శోభన్‌ 'కల్యాణం కమనీయం' సినిమాతో టాలీవుడ్‌ను పలకరించారు. 'దూత' వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్నారు. తాజాగా 'ఇరుముడి' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రణవీర్ సింగ్ ఇంట్లో విషాదం... 96 యేళ్ల తాతయ్య ఇకలేరు...