దక్షిణ కొరియాకు చెందిన హ్యేయిన్ కిమ్‌తో గల్లా జయదేవ్ చిన్న కుమారుడి పెళ్లి
Mahesh Babu, Nephew
సిద్ధార్థ్- హ్యేయిన్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి నిశ్చితార్థం ఇటీవల జరగగా, అంతకుముందు విడుదలైన వీరి ప్రీ-వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందాయి. ఈ వివాహ వేడుకకు ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులతో పాటు, వధువు కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితులు హాజరయ్యారు.
మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని, వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. నవ దంపతులు సాంప్రదాయ, ఆధునిక వివాహ దుస్తులలో ఎంతో అందంగా కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు అభినందనలు తెలుపుతూ, వారి వైవాహిక జీవితం సుఖమయంగా ఉండాలని ఆకాంక్షించారు.
అయితే, ఒక ఆసక్తికరమైన విషయం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు విడుదలైన వివాహ ఫోటోలలో మహేష్ బాబు ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం ఈ సూపర్ స్టార్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న అడ్వెంచర్ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు తన షూటింగ్ షెడ్యూల్ బిజీగా ఉండటం వల్లే మేనల్లుడి వివాహానికి హాజరు కాలేకపోయి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు.
అయితే, ఆయన ఈ వేడుకకు హాజరయ్యారా లేదా అనే దానిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఏది ఏమైనప్పటికీ, సిద్ధార్థ్ గల్లా- హ్యేయిన్ కిమ్‌ల వివాహ ఫోటోలకు సోషల్ మీడియాలో అభిమానుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

