1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Abhijeet Dipke Diagnosed with Typhoid, Says Protest will Continue

కాక్రోచ్ చీఫ్‌ అభిజీత్ డిప్కేకు టైఫాయిడ్.. అయినా వెనక్కి తగ్గరట...

Abhijeet Dipke
Abhijeet Dipke
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే శనివారం నాడు తనకు టైఫాయిడ్ సోకినట్లు వెల్లడించారు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సాగుతున్న ఉద్యమాన్ని తన అనారోగ్యం ఏమాత్రం మందగించనివ్వదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పంచుకున్న ఒక వీడియో సందేశంలో, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నానని డిప్కే తెలిపారు.
 
అనారోగ్యంతో ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా నిరసనలను కొనసాగిస్తున్న సీజేపీ మద్దతుదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉద్యమం తన లక్ష్యాన్ని తప్పక సాధిస్తుందని పేర్కొన్నారు. 
 
"మీకు తెలిసినట్లుగానే, గత కొన్ని రోజులుగా నేను అనారోగ్యంతో ఉన్నాను. వైద్య పరీక్షల నివేదికలు వచ్చాయి, నాకు టైఫాయిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది," అని చెప్పారు. తాను చికిత్స పొందుతున్నానని, సిరల ద్వారా మందులు (ఐవీ) తీసుకుంటున్నానని డిప్కే తెలిపారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.. ప్రతిరోజు తనకు ఐవీ ట్రిప్స్ ఇస్తున్నారని.. దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న అందరికీ తాను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నానని తెలిపారు. 
 
ఉద్యమాన్ని విస్తృతం చేస్తున్నందుకు మద్దతుదారులను అభినందించిన డిప్కే, నిరంతర శాంతియుత నిరసనలు తమ ప్రధాన డిమాండ్ అయిన కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామాను సాధించడంలో సహాయపడతాయని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.  
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
NEET అంటే ఏమిటో తెలియదు, మీరు ప్రొటెస్ట్ చేస్తారా? ఆంధ్ర విద్యార్థులు వీడియో