1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Air Intelligence Unit (AIU), Ahmedabad Customs recovered gold paste

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్న ఎయిర్ ఇంటెలిజెన్స్ (వీడియో)

gold paste
అహ్మదాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడుని నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల ప్రొఫైలింగ్ ఆధారంగా, అహ్మదాబాద్ కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు, అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుండి వచ్చిన ఒక ప్రయాణికుడిని అనుమానించి అతని లగేజీని తనిఖీ చేశారు. 
 
ఆ ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్ (క్యాబిన్ బ్యాగేజీ)ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, బ్యాగ్ లోపల అతికించిన ఒక అనుమానాస్పద ప్యాచ్‌ను గమనించారు. పరిశీలించగా, ట్రాలీ బ్యాగ్ లోపల అతికించిన ఒక గుడ్డ ప్యాచ్ మీద బంగారు పేస్ట్‌ను ఒక పొరగా దాచి ఉంచినట్లు తేలింది.
 
ఆ బంగారు పేస్ట్‌ను బయటకు తీసి కరిగించగా, రూ.20,12,426 విలువైన 133.450 గ్రాముల 24 క్యారెట్ల బంగారం లభించింది. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం జప్తు చేశారు. ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు. 


 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
విజయదశమి సందర్భంగా ప్రజలకు ప్రధాని మోడీ - ఇతర నేతల శుభాకాంక్షలు