మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (18:27 IST)

పడవలనే క్లాస్ రూమ్స్‌గా మార్చేశారు... టీచర్లు భేష్

Classes in Boats
భారీ వర్షాల కారణంగా ఉత్తరాదిన జనం నానా తంటాలు పడుతున్నారు. బీహార్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. . చెరువులు పొంగడంతో… గ్రామాల్లోకి నీరు చేరింది. ఇళ్లు ఖాళీ చేసి శరణార్థి శిబిరాల్లోనూ జనం ఉంటున్న పరిస్థితి. రోజులు గడుస్తున్నా… పడవల్లోనే జనం ప్రయాణించాల్సి వస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. కతిహార్ జిల్లాలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. దీంతో బండ్లు మరిచిపోయిన జనం… పడవల్లోనే రాకపోకలు చేస్తున్నారు. స్కూళ్లు కూడా మునిగిపోయాయి. ఆవరణలో వరదనీరు కారణంగా… ఎవరూ స్కూళ్లోకి పోని పరిస్థితి. విద్యార్థులు, ఉపాధ్యాయులు పడవలపైనే వస్తూ పోతున్నారు.
 
మనిహర ఏరియాలో… సర్కారు టీచర్లు ఓ అడుగు ముందుకేశారు. పిల్లల భవిష్యత్తు పాడవ్వొద్దన్న ఉద్దేశంతో… సాహసానికి తెగించారు. స్కూళ్లలో వరద నిలిచిపోవడంతో.. పడవలనే క్లాస్ రూమ్స్‌గా మార్చేశారు. పడవల్లోనే బోర్డులు ఏర్పాటు చేసి.. పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. నీళ్లలో అటు ఇటు ఊగే పడవలో.. రిస్క్ తీసుకుంటున్నప్పటికీ… పిల్లలు చదువుకు దూరం కాకుండా జాగ్రత్తపడుతున్నారు.
 
పడవల్లో పాఠాలు వినేందుకు మొదట్లో ఎవరూ రాలేదన్నారు టీచర్లు. మునిగిపోయే ప్రమాదం ఉండదని… చదువుకునేందుకు అనువుగా ఉండే ప్లేస్ పడవలే అని నచ్చచెప్పామన్నారు. తాము స్టూడెంట్లకు, వారి పిల్లలకు ధైర్యం చెప్పడంతో… ఇపుడు పడవల్లో పాఠాలు వినేందుకు పెద్దసంఖ్యలో వస్తున్నారని చెప్పారు కతిహార్ టీచర్లు.