1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Kerala : accidental plan for marriage with girlfriend

ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు యాక్సిడెంట్ ప్లాన్

kerala accident
ప్రియురాలిని వివాహం చేసుకునేందుకు ఓ యువకుడు వేసిన యాక్సిడెంట్ ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. పథనందిట్టకు చెందిన రంజిత్ రాజన్ ఓ యువతిని ప్రేమించాడు. ఆ కుటుంబానికి మంచి అభిప్రాయం ఏర్పడేందుకు ఓ ప్రణాళిక చేశాడు. 
 
ప్రియురాలిని కారుతో ఢీకొట్టించి, తన కాపాడినట్టుగా చేసి ఆమె కుటుంబ సభ్యులతో హీరో అనిపించుకోవాలన్నాడు. స్నేహితుడు ఎజెస్‌తో కలసి ప్రణాళికలు అమలు చేశాడు. గత యేడాది డిసెంబరు 23వ తేదీన రంజిత్ ప్రియురాలు కోచింగ్ సెంటర్ నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా వాఝుముట్టం ఈస్ట్ ప్రాంతంలో ఎజెస్ ఆమెను కారుతో ఢీకొట్టించి వెళ్లిపోయాడు. 
 
ఈ ఘటనలో ఆమె మోచేయి, చేతి వేలు విరిగింది. మరో కారులో వచ్చిన రంజిత ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కుమార్తెను కాపాడేందుకు ఆమె తల్లిదండ్రులు మెచ్చుకుని వివాహం చేస్తారని రంజిత్ భావించాడు. ఈ పథకం పోలీసులు ఎజెస్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పథకం సంగతి తేలింది. రంజిత్‌తో పాటు ఎజెస్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భారత్‌పై డోనాల్డ్ ట్రంప్ కన్నెర్ర : 500 శాతం సుంకాలు మోతకు సిద్ధం