1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Uttar Pradesh : Executive Engineer Caught With Computer Operator

సైట్ తనిఖీకి పేరుతో హోటల్ గదికి... రెడ్‌హ్యాండెండ్‌గా చిక్కిన భార్య (Video)

wife caught redhanded
ఓ వివాహిత తన భర్తను మోసం చేసేందుకు ప్రయత్నించి చివరకు చిక్కుల్లో పడ్డారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో కలిసి సైట్ తనిఖీ కోసం వెళుతున్నట్టు భర్తను నమ్మించింది. చివరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో కలిసి ఓ హోటల్ గదిలో ఎంజాయ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఆ మహిళ ప్రభుత్వ కంప్యూటర్ ఆపరేటర్ భార్య. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ ఉదయ్ ప్రతాప్ సింగ్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది. ఈ క్రమంలో తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఓ ప్లాన్ వేసింది. సర్‌తో కలిసి సైట్ తనిఖీ చేయడానికి వెళ్తున్నానని భర్తను నమ్మబలికింది. 
 
అయితే, భర్తకు భార్య చెప్పిన మాటలపై అనుమానం వచ్చింది. దీంతో స్కూటర్‌పై ఆమెను వెంబడించి, హోటల్ గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... కేసును విచారిస్తున్నారు. 


 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భారతీయ మహిళలకు వివాహం ఓ ట్రామా వంటిది : కిరణ్ బేడీ