1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Viral Video Shows Passengers Standing Inside Flight; Air India Express Issues Response

రన్‌వేపై విమానం కదులుతుండగా విమానంలో నిలబడిన ప్రయాణీకులు (వీడియో)

Passengers
Passengers
రన్‌వేపై విమానం కదులుతుండగా కొందరు ప్రయాణికులు లోపల నిలబడి ఉన్నట్లు చూపే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పందించింది. విమానం లోపల ప్రయాణికులు నిలబడి ఉండటాన్ని చూసిన అమితావ దాస్ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, విమానయాన సంస్థ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తారు. 
 
దీనిపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పందించింది. IX 1236 విమానంలో గమనించిన సంఘటనతో సదరు సంస్థ చింతిస్తున్నట్లు పేర్కొంది. భద్రతే తమ అత్యున్నత ప్రాధాన్యత అని, అన్ని కార్యకలాపాలు వర్తించే భద్రతా విధానాలు  నియంత్రణ అవసరాలకు అనుగుణంగానే నిర్వహించబడతాయని దయచేసి హామీ ఇస్తున్నామని తెలిపింది.
 
ప్రయాణం పొడవునా అన్ని భద్రతా నియమాలను పాటించేలా, విమానంలో తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా పరిష్కరించేలా తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వబడిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ప్రయాణికులు భద్రతా నియమాలను పాటించాలని అభిప్రాయపడగా, మరికొందరు భద్రతా నిబంధనలు అమలయ్యేలా చూసుకోవడంలో సిబ్బంది బాధ్యతపై ప్రశ్నలు లేవనెత్తారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇరాన్ విమానాలు ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేత : అమెరికా