1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
  4. power star pawan kalyan going to UK

లండ‌న్‌లో యుక్తా సంబ‌రానికి ముఖ్య అతిథిగా ప‌వ‌ర్ స్టార్...

లండ‌న్ : యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్(యుక్తా), భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య (ఐసిసిఆర్), భారతీయ విద్యా భవన్, నెహ్రూ సెంటర్ సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జయతే కూచిపూడి" పండుగ ముగింపు దశకు చేరుతోంది. 45 మంది కళాకారుల బృందం యూరప్‌లోని ఇ

power star pawan kalyan
లండ‌న్ : యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్(యుక్తా), భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య (ఐసిసిఆర్), భారతీయ విద్యా భవన్, నెహ్రూ సెంటర్ సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జయతే కూచిపూడి" పండుగ ముగింపు దశకు చేరుతోంది. 45 మంది కళాకారుల బృందం యూరప్‌లోని ఇటలీ, ఫ్రాన్స్ జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ దేశాల్లో నెల రోజులపాటు కూచిపూడి, యక్షగానం, బతుకమ్మ నీరాజనం, తెలంగాణ జానపదం వంటి ప్రదర్శనలిచ్చి లండన్ నగరం చేరుకోనున్నారని యుక్తా అధికార ప్రకటన విడుదల చేసింది. 
 
ఈ నెల 9వ తేదీన తూర్పు లండన్‌లో ఉన్న ట్రాక్సీ థియేటర్‌లో జరుగనున్న యుక్తా వార్షికోత్సవ వేడుకలలో ఈ బృందాన్ని ఘనంగా సన్మానించనున్నారు. ముఖ్య అతిథిగా ప్రఖ్యాత సినీ నటుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హాజ‌ర‌వుతున్నారు. దీనికి రెండువేల మంది ప్రవాస తెలుగువారు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. పవన్ మొదటిసారిగా లండన్ నగరానికి విచ్చేయనున్న సందర్భంగా అభిమానులు భారీఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.
About Writer
JSK
తర్వాతి కథనం
అధిక పొట్టతో బాధపడుతున్నారా? డోంట్‌వర్రీ.. పొట్ట సులభంగా త‌గ్గే మార్గాలివే?