బుధవారం, 13 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 10 నవంబరు 2018 (14:22 IST)

నాలుకకు ఆ భాగంలో మచ్చ ఉంటే..?

పుట్టుమచ్చలు అనేవి సాధారణంగా అందరికి ఉండేవే. మరి ఈ పుట్టుమచ్చ నాలుగ భాగంలో ఉంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.. నాలుక చివరి భాగంలో మచ్చ ఉన్నచో వారు ఎదుటివారి మనస్సును అర్థం చేసుకునే వారైయుంటారు. మాటలతోనే అందరికి ఆకట్టుకుంటారు. ఒకవేళ ఆ మచ్చ పచ్చ రంగులో ఉంటే.. వారు విద్యావంతుడై అనేక సభలలో గౌరవ సన్మానాలు పొందుతారు.
 
అలానే నాలుక కింది భాగంలో మచ్చ ఉన్నచో వారు యోగాభ్యాసమునందు కోరిక కలవారై ఉంటారు. అంతేకాకుండా తపస్సు చేయుటకు అడవులకు వెళుతారు. నాలుక పై భాగంలో పుట్టుమచ్చ ఉన్నచో వారు గొప్ప ఉపన్యాసులవుతారు. మెుత్తం మీద ఏరంగులో మచ్చ ఉన్నను శుభ ఫలితాలే ఏ కలుగుతాయి.