శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (12:50 IST)

పెళ్లిలో ఆ రెండింటిని ఎందుకు పెట్టిస్తారో తెలుసా..?

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. మరి ఆ పెళ్లిలో జీలకర్ర బెల్లాన్ని ఎందుకు పెట్టిస్తారో తెలుసుకుందాం.. పూర్వకాలం నుండే సంప్రదాయాలు, ఆచారాల్లో అనేక సూక్ష్మ అంశాలతో ముడిపడి ఉంటాయి. అంతేకాకుండా ఒక్కో కోణంలో ఒక్కో అంతర్యాన్ని తెలియజేస్తాయి. జీలకర్రను సంస్కృతిలో జీర దండమని అంటారు. జీలకర్ర అంటే బతుకు, జీవనమని అర్థం.
 
ఇక బెల్లం అంటే.. గుడం అంటారు. గుడం అంటే నిద్ర, మత్తు. దీనినే పరవశం అంటారు. జీలకర్ర, బెల్లం రెండు కలిస్తే జీవనాధార గుణమని అర్థం. సాధారణంగా అందరికి జీవించడానికి కావలసినది.. ప్రేమ, స్నేహం, మైత్రి, ఆపేక్ష వంటివి. వీటినే దండం అంటారు. భర్త భార్యను ప్రేమించడం, భార్య భర్తను ప్రేమించడం అనేది వివాహం. వారిద్దరి మధ్య ప్రేమ మత్తులా, నిద్రలా ఉండాలనే జీలకర్ర, బెల్లాన్ని పెట్టిస్తారు. వివాహం పరమార్థం కూడా ఇదే..
 
జీలకర్ర, బెల్లాన్ని కలిపితే మళ్లీ వాటిని విడదీయలేం. కాబట్టి భార్య, భర్తలు కూడా అలా విడిపోకుండా ఉండాలని జీలకర్ర, బెల్లాన్ని పెట్టిస్తారు. అంటే.. భార్యభర్తల జీవితంలో ఎదుటివారికి వారి పరవశం, జీవనమాధుర్యం, ఆ మత్తే కనిపిస్తుంది. ఈ మత్తు వెనుక ప్రేమ, స్నేహం, అనురాగం, మైత్రి అంతరిల్లి ఉంటాయి. భార్యభర్తలు కలిసిమెలిసి ఉండాలని జీలకర్ర, బెల్లం బోధిస్తుంది.