శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (20:57 IST)

గడ్డం మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే..?

సాధారణంగా పుట్టుమచ్చలు అందరికి ఉంటాయి. మరి ఆ మచ్చలు గడ్డం ప్రాంతంలో ఉంటే.. జరిగే లాభాలు, నష్టాలు తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం గడ్డం మధ్యభాగంలో పుట్టుమచ్చ ఉన్నచో వారు ధనవంతులై ఉంటారు. అంతేకాకుండా దానధర్మాలు చేస్తారు. కీర్తివంతుడై దేవబ్రాహ్మణ భక్తి గలవారై ఉంటారు. గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉన్నవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడింది.
 
అలానే గడ్డం క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే.. వారు విధ్వాంసులై ఉంటారు. తద్వారా వారికి సకలసంపదలు చేకూరుతాయి. గడ్డం ఎడమ భాగంలో మచ్చ ఉంటే.. దైవభక్తి గలవారై అందరి మన్ననలను పొందుతారు. గడ్డం కుడి భాగంలో పుట్టుమచ్చ ఉన్నచో.. వారు మర్యాద గలవాడును, కీర్తిని సంపాదించువారగుదురు.