మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (09:26 IST)

స్త్రీకి అనుమతించని గుడి ఆలయమే కాదు.. అయ్యప్ప దేవుడే కాదు..

సినీ నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ అయ్యప్ప పుణ్యక్షేత్రంలోకి మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం కేరళ సర్కారు శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ, ఆలయ పాలక మండలితోపాటు.. అయ్యప్ప భక్తులు మాత్రం ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "స్త్రీ అంటే తల్లి. మనం పుడమిని తల్లితో పోలుస్తాం. మనకు జన్మనిచ్చేదీ ఆ మహిళే. మరి అదే మహిళను పూజలకు దూరంగా ఉంచడంలో అర్థం ఏమిటి? మహిళలను ప్రార్థించడానికి అనుమతించని మతం నా దృష్టిలో మతమే కాదు. దైవదర్శనానికి అతివలను అనుమతించని భక్తులు భక్తులే కాదు. తన సన్నిధికి మహిళలను అనుమతించని అయ్యప్ప దేవుడే కాడు" అంటూ వ్యాఖ్యానించారు.