సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (15:51 IST)

ఈ వారాల్లో డబ్బు దానం చేస్తే..?

శుక్రవారం అంటే లక్ష్మీదేవి. ఎవరైనా లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలనే అనుకుంటారు. కానీ, కొందరైతే ఆమెను ఇష్టమొచ్చినట్లు దానం చేసేస్తుంటారు. అంటే.. శుక్రవారం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కనుక ఆ నాడు డబ్బులను ఇతరులకు దానం చేయడం మంచిది కాదని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే.. శుక్రవారం రోజున మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారో.. ఆ డబ్బు మీకు తిరిగి రాదనేది విశ్వాసం.
 
మన చేతిలోని లక్ష్మిని ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందువలన శుక్రవారాల్లో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఎవరికి రుణాన్ని దానం చేయెద్దు. రుణం దానం చేయడం మంచిదే కానీ, శుక్రవారాల్లో చేయడం మంచిది కాదని చెప్తున్నారు. అలానే మంగళవారం నాడు ఎవరికైన అప్పు ఇస్తే.. భార్యాభర్తల మధ్య కలహాలు చోటుచేసుకుంటాయి. 
 
అందువలన ఈ రెండు రోజుల్లో మాత్రం ఎవరికీ అప్పు ఇవ్వకూడదని అంటారు. వాస్తవానికి మంగళ, శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి, సొంతానికి, కుటుంబ వ్యవహారాల కోసం ఖర్చు పెట్టవచ్చును.