శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (18:15 IST)

కొత్త ఇంటి ప్రవేశంలో పాలు ఎందుకు పొంగిస్తారంటే..?

సాధారణంగా కొత్త ఇల్లు కట్టుకున్నా.. లేదా.. ఇతర ఇళ్లలోకి ప్రవేశించినా.. ఆ ఇంట్లో పాలు పొంగించడం సంప్రదాయం. ఇలా పాలు పొంగిస్తే గృహాల్లో అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెప్తున్నారు. మరి దీని వెనుక గల అర్థాన్ని తెలుసుకుందాం.. సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ధనధాన్యాలు చేకూర్చేవారు. ఎక్కడైతే శుచి శుభ్రతతో ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పక కొలువై ఉంటారు. సముద్ర గర్భం నుండి జన్మించారు.
 
నారాయణి హృదయేశ్వరుడు పాల సాగరమున పవళించిన శ్రీహరి. లక్ష్మీదేవి ఇంట్లో నివాసముంటారు. కనుక ఆ ఇండ్లల్లో పాలు పొంగిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ధనం, ప్రశాంతత చేకూరుతుందని విశ్వాసం. అలానే కొత్తగా నిర్మించిన ఆ ఇంట్లోకి ముందుగా ఆవును ప్రవేశపెట్టి ఆ తరువాత ఇంటి యజమాని లోపలికి ప్రవేశిస్తే.. ఆ ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవని చెప్తున్నారు. 
 
కొందరు కొత్తగా ఇంట్లోకి చేరే సమయంలో ఆ ఇంటి యజమాని ఆడపడుచును పిలిచి పాలు పొంగించి ఆ పాలలో అన్నం వండి చుక్కపక్కల వారికి సమర్పిస్తారు. ఇలా చేస్తే.. ఆ ఇంట్లో సుఖశాంతులకు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు.